విషాదం పెళ్లై ఏడాది కాకముందే.. చేపలవేటకు వెళ్లి...
సిరిసిల్ల మానేరు కరకట్ట బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు గల్లంతైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నింపింది.
సిరిసిల్ల మానేరు కరకట్ట బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు గల్లంతైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. స్థానిక బోయవాడకు చెందిన గడప శేఖర్ రోజూ మాదిరిగానే కరకట్ట బ్యాక్ వాటర్ లో మధ్యాహ్నం మూడు గంటలకు తెప్పపై చేపల వేటకు వెళ్లాడు. కొద్దిదూరం వెళ్ళాక ప్రమాదవశాత్తు కాలుజారి తెప్పపై నుండి పడిపోయాడు. గల్లంతయిన శేఖర్ కోసం తోటి మత్స్యకారులు నాలుగు గంటలు గాలించి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకు వచ్చారు. మృతుడు శేఖర్ కు వివాహం జరిగి సంవత్సరం కూడా కాకపోవడంతో కుటుంబం మంతా శోకసముద్రంలో మునిగిపోయింది.