Asianet News TeluguAsianet News Telugu

మానుకొండూరు ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధిత కుటుంబం ఆందోళన...

కరీంనగర్ : తమ భూమిని ఎమ్మార్వో వేరేవారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంటూ ఓ కుటుంబం మానుకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.

First Published Dec 30, 2022, 4:55 PM IST | Last Updated Dec 30, 2022, 4:55 PM IST

కరీంనగర్ : తమ భూమిని ఎమ్మార్వో వేరేవారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంటూ ఓ కుటుంబం మానుకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఎవరిని కలిసినా న్యాయం జరక్కపోవడంతో ఇలా ఆందోళనకు దిగుతున్నామని... ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధిత కుటుంబం వాపోతోంది.ముంజంపల్లి గ్రామ శివారులో పిల్లి మల్లయ్య పేరిట సర్వే నెంబర్ 725/ఏ లో ఎకరం భూమి వుందని... ఆయన చనిపోయాక ఆ భూమిని తహసీల్దార్ వేరేవరికో రిజిస్ట్రేషన్ చేసిచ్చారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఎమ్మార్వో లక్ష్మారెడ్డి సహకారంతో తమ గ్రామానికే చెందిన వేల్పుగొండ లింగయ్య తమ భూమిని కాజేసాడని తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబమంతా ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగింది.