Sarala Sagar Project : భారీగా గండిపడిన సరళాసాగర్ ప్రాజెక్టు

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టుకు  రోజు ఉదయం 6 గం.సమయంలో భారీగా గండి పడింది.

First Published Dec 31, 2019, 2:21 PM IST | Last Updated Dec 31, 2019, 2:21 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టుకు  రోజు ఉదయం 6 గం.సమయంలో భారీగా గండి పడింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిలు ప్రాజెక్ట్ ను పరిశీలించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన తెల్లవారుజామున జరగడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. చాలా ఏళ్ళ తరువాత ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయిలో నింపుకున్నాం. మట్టికట్ట మాత్రమే తెగిపోయింది, ప్రాజెక్ట్ మెయిన్ పార్ట్ స్టక్చర్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదన్నారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం అన్నారు.