వీరతిలకం దిద్ది, మంగళహారతులు పట్టి... మునుగోడులో ఈటల క్రేజ్ చూడండి...


నల్గొండ : తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మనుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.

Share this Video


నల్గొండ : తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మనుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలంతా మునుగోడు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇలా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఇవాళ(సోమవారం) నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామంలో ప్రచారం చేపట్టారు. గ్రామానికి చేరుకున్న ఈటలకు బొట్టు పెట్టిన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దారిపొడవునా ఈటలతో పాటు బిజెపి ప్రచార బృందంపై పూలవర్షం కురిపించారు. కొందరు శాలువాలతో ఈటలను సత్కరించగా ఆయన కూడా చిన్నారులకు శాలువా కప్పి ఆత్మీయంగా పలకరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 కేతేపల్లిలో ఇంటింటికీ వెళ్ళి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఈటల కోరారు. వృద్దులు, మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని బిజెపికి మద్దతుగా నిలవాలని సూచించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేతేపల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఈటల రాజేందర్. 

Related Video