గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి మాదాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి మాదాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పరమావధిగా సాగుతున్న ఈ యజ్ణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉందని హారిక తెలిపారు. ఈ క్రమంలో, దీనిని ముందుకు తీసుకుపోయేందుకు, బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు , టెన్నిస్ క్రీడాకారిణి చిలుముల నిధి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి లకు మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు.