రాసలీలల నిత్యానంద వేషాలు ఇన్నిన్ని కావయా...
వివాదాస్పద ఆధ్వాత్మిక గురువు స్వామి నిత్యానంద పేరు వినగానే..
వివాదాస్పద ఆధ్వాత్మిక గురువు స్వామి నిత్యానంద పేరు వినగానే.. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన రాసలీలలే గుర్తుకువస్తాయి. ఆ వీడియో బైటపడిన తరువాత దానినుండి తప్పించుకోవడానికి అది మార్ఫింగ్ అని, తానసలు మగాడినే కాదని రకరకాల కథలల్లాడు నిత్యానంద. కానీ తప్పించుకోలేకపోయాడు. ఇదొక్కటే కాదు అత్యాచారం, మోసం ఇలాంటి అనేక ఆరోపణల మీద ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 50 సార్లు కోర్టుకు హాజరయ్యాడు. గతేడాది నవంబరులో భారత్ వదలి పారిపోయాడు. ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం తెలియక పోలీసులు వెతుకుతుంటే ఆయన మాత్రం ప్రత్యేక ద్వీపం, ప్రత్యేక రిజర్వ్ బ్యాంక్ అంటూ షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు.