Asianet News TeluguAsianet News Telugu

పబ్జీ బ్యాన్.. కానీ వీటిల్లో ఆడుకోవచ్చు.. !

భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. 

భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీతో పాటు మరో 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ మొబైల్ యాప్‌ను బ్యాన్ చేయాలని గతంలో కేంద్రానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి.  దేశ సమగ్రతకు, భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.