Asianet News TeluguAsianet News Telugu

జేఎన్ యూ విద్యార్థి సర్జిల్ ఇమామ్ పై దేశద్రోహం కేసు

మంగళవారం నాడు న్యూఢిల్లీ పోలీసులు బీహార్ లోని జహనాబాద్ లో సర్జీల్ ఇమామ్ ను అరెస్ట్ చేశారు. 

మంగళవారం నాడు న్యూఢిల్లీ పోలీసులు బీహార్ లోని జహనాబాద్ లో సర్జీల్ ఇమామ్ ను అరెస్ట్ చేశారు. అలీఘడ్ యూనివర్శిటీలో ఈ  ఏడాది జనవరి 16 వ తేదీన సర్జీల్ ఇమామ్ చేసిన ప్రసంగంపై  పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. బీహార్ నుండి ఇమామ్ ను ఢిల్లీకి తరలించారు. ఈ క్రమంలో పాట్నా విమానాశ్రయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మీడియా పర్సన్స్ మీద పోలీసులు చేయిచేసుకున్నారు. కెమెరామెన్లతో సహా నలుగురు మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి.