Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఎందరో భారతీయులకు ఉపాధి కల్పించిన వ్యాపారవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా

భారతదేశ ధనిక వ్యాపారవేత్తలు స్వాతంత్ర పోరాటానికి పోరాటం చేశారా ? ఈ ప్ర‌శ్నకు స‌మాధానం లేద‌నే వ‌స్తుంది.

భారతదేశ ధనిక వ్యాపారవేత్తలు స్వాతంత్ర పోరాటానికి పోరాటం చేశారా ? ఈ ప్ర‌శ్నకు స‌మాధానం లేద‌నే వ‌స్తుంది. నిజ‌మే చాలా మంది స‌హాయం చేయ‌లేదు. కానీ కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్త‌లు జాతీయోద్యమంలో పాల్గొన‌డంతో పాటు మహాత్మాగాంధీతో కూడా సన్నిహితంగా మెలిగారు. వారిలో ఘనశ్యాం దాస్ బిర్లా, జమ్నాలాల్ బజాజ్ లు ఉన్నారు. వీరు ఉద్య‌మంలో చురుకుగా ఉండ‌టంతో పాటు సొంత నిధుల‌తో ఆధునిక పరిశ్రమలను స్థాపించి పెద్ద సంఖ్యలో భారతీయులకు జీవనోపాధిని క‌ల్పించారు. దీని వ‌ల్ల వారు జాతీయవాదానికి బలాన్ని అందించారు.బిర్లా కుటుంబం 19వ శ‌తాబ్దం మధ్యలో రాజస్థాన్ లోని ఝున్ ఝునులోని పిలానీ గ్రామం నుంచి ముంబైకి వలస వచ్చింది. వారు ప్రత్తి, వెండి, ధాన్యాలు మొదలైన వ్యాపారాల్లోకి ప్రవేశించారు. తరువాత చైనాతో నల్లమందు వ్యాపారంలో చేరడం ద్వారా సంపదను కూడబెట్టారు. అది ఆ స‌మ‌యంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం. ఘనశ్యాందాస్ ఈ కుటుంబంలోని మూడో త‌రానికి చెందిన వాడు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పరంపరతో ఘనశ్యాందాస్ త‌న 11 సంవత్సరాల వయస్సులో పాఠశాల విద్యను నిలిపివేసి తండ్రి వ్యాపారంలో చేరాడు.ఆయ‌న కలకత్తాకు వెళ్లి 1918 లో ఒక జనపనార మిల్లుతో తన మొదటి వ్యాపారాన్ని స్థాపించాడు. బ్రిటీష్, స్కాట్స్ గుత్తాధిపత్యం కలిగిన వ్యాపారంలోకి 29 ఏళ్ల భారతీయుడు ప్రవేశించడంపై వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఘన శ్యాందాస్ ఆందోళ‌న చెంద‌లేదు. మొద‌టి ప్రపంచ యుద్ధం ఆయ‌న‌కు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.విదేశీ వ్యాపార వేత్తల శత్రుమార్గాలు ఘనశ్యాం దాస్ లో జాతీయవాద స్ఫూర్తిని రగిలించాయి. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి జాతీయోద్యమంలో చేరబోతున్న మహాత్మాగాంధీని ఆయన కలుసుకున్నారు. ఈ సమావేశం గాంధీజీకి, ఘనశ్యామ్ దాస్ బిర్లాకు మధ్య జీవితకాల అనుబంధానికి, స్నేహానికి దారితీసింది. గాంధీతో సన్నిహితంగా ఉండటం అత్యంత ఆయ‌న‌కు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆయ‌న చ‌లించ‌లేదు. చాలా సార్లు మహాత్ముడితోనూ, బ్రిటిష్ అధికారులతోనూ మధ్యవర్తిగా వ్యవహరించారు. కొన్ని విషయాల్లో గాంధీజీతో తీవ్రమైన విభేదాలు వచ్చినప్పుడు కూడా ఆయన గాంధీజీకి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారుగా ఉన్నారు. దాస్ 1926లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ప‌ని చేశారు. అలాగే 1932లో గాంధీజీ స్థాపించిన హరిజన సేవక్ సమాజ్ కు అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన గాంధీజీ హరిజన పత్రికకు కూడా కొంతకాలం సంపాదకత్వం వహించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు జాతీయ పత్రిక హిందుస్తాన్ టైమ్స్ ను ఘనశ్యాందాస్ తన ఆధీనంలోకి తీసుకొని రక్షించారు. 1940లో క్విట్ ఇండియా ఉద్యమం దేశం మొత్తం క‌దిలింది. ఇందులో ఘనశ్యాందాస్ పాల్గొన్నారు. అయినప్పటికీ బిర్లా తన రంగంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా జాతీయ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళడం కొనసాగించారు. 1942లో కలకత్తాలో హిందుస్థాన్ మోటార్స్ ను స్థాపించి, దేశం విదేశీ పాలనలో ఉన్నప్పుడు కూడా ఒక భారతీయ కారును రూపొందించాల‌ని భావించారు. చివ‌రికి హిందుస్థాన్ మోటార్స్ తయారు చేసిన అంబాసిడర్ కారు భారతీయ అస్తిత్వానికి గర్వకారణంగా నిలిచింది. మరుస‌టి ఏడాది ఘనశ్యాం దాస్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అనే ఒక బ్యాంకును స్థాపించారు. అదే ఇప్పుడు జాతీయమైన UCO బ్యాంక్.స్వ‌తంత్రం వ‌చ్చిన అనంత‌రం ఘనశ్యాందాస్ వ్యాపార సామ్రాజ్యం విపరీతంగా అభివృద్ధి చెందింది. అత‌డు పిలానీలోని తన పూర్వీకుల గ్రామంలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా స్థాపించారు. అది ఇప్పుడు బిట్స్ పిలానీగా ప్రసిద్ధి చెందింది. భారతీయ కార్పొరేట్ సంస్థల అతిపెద్ద సంస్థ అయిన ఫిక్కీని (FICCI) కూడా ఆయనే స్థాపించారు. ఎప్పుడూ గాంధీజీకి సమర్థుడైన మద్దతుదారుగా ఆయ‌న నిలిచారు. మహాత్ముడు తన చివరి మూడు నెలలను ఘనశ్యామ్ దాస్ ఢిల్లీ నివాసంలో గ‌డిపారు. 1948 జనవరి 30న హత్యకు గురైన స‌మ‌యంలో కూడా ఆయ‌న ఇంట్లోనే ఉన్నారు. ఘనశ్యాందాస్ 1983లో త‌న 85వ ఏట తుది శ్వాస విడిచారు. ప్రైమ‌రీ స్కూల్ డ్రాపవుట్ గా అయిన ఆయ‌న చ‌నిపోయే నాటికి తన బిర్లా గ్రూపును రూ.1000 కోట్లకు పైగా ఆస్తులతో బహుళజాతి సంస్థగా ఉంది. అది ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది.