Asianet News TeluguAsianet News Telugu

విక్రాంత్ రోణా మూవీ పబ్లిక్ టాక్ : అంత గొప్పగా ఏమీ లేదు... ఒకసారి చూడొచ్చు అంతే..!

చెప్పుకోవటానికి  కన్నడ  హీరో అయినా సుదీప్ ఈ రోజు దాదాపు అన్ని భాషల వారికి పరిచయమే. 

First Published Jul 28, 2022, 2:39 PM IST | Last Updated Jul 28, 2022, 2:39 PM IST

చెప్పుకోవటానికి  కన్నడ  హీరో అయినా సుదీప్ ఈ రోజు దాదాపు అన్ని భాషల వారికి పరిచయమే. ముఖ్యంగా తెలుగులో  ఈగ సినిమాతో విలన్ గా పరిచయమయ్యారు.  దాంతో సుదీప్ చేస్తున్న దాదాపు  చాలా  సినిమాల ఇక్కడ డబ్బింగ్ అవుతున్నాయి. అయితే నేరుగా ఇప్పటివరకు సుదీప్ ఏ సినిమాతోనూ మళ్ళీ తెలుగులో హీరోగా రాలేదు. మధ్యలో బాహుబలి, సైరా వంటి సినిమాలలో అడపాదడపా పాత్రలు చేశారు.  ఇప్పుడు  విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా  పాన్ ఇండియా  రిలీజ్ తో మన  ముందుకు వచ్చారు.  ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అలాగే మిగతా పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది... తెలుగు వారికి నచ్చుతుందా వంటి విషయాలు ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం.