నమ్మించి మోసం చేశాడంటూ.. హెయిర్ డై తాగి యువతి ఆత్మహత్యాయత్నం..

లోకల్ యాప్ లో పెళ్లిపుస్తకం ద్వారా పరిచయం అయిన ఓ జంట పెళ్లికి ముందే ఆర్నెళ్లు కాపురం చేశారు. 

First Published May 19, 2020, 10:36 AM IST | Last Updated May 19, 2020, 10:36 AM IST

లోకల్ యాప్ లో పెళ్లిపుస్తకం ద్వారా పరిచయం అయిన ఓ జంట పెళ్లికి ముందే ఆర్నెళ్లు కాపురం చేశారు. చివరికి పెళ్లి చేసుకోననడంతో ఓ యువతి హెయిర్ డై తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెడితే కరీంనగర్ జిల్లా లింగాపూర్ కు చెందిన చల్లూరి కోమల సిరివల్లి, తాడికల్ గ్రామానికి చెందిన కనకరాజు ఓ యాప్ లోని కార్యక్రమం ద్వారా పరిచయం అయ్యారు. ఆర్నెళ్లు పెళ్లి కాకుండా కలిసి ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నాడంటూ కోమల కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చింది. నాలుగైదు రోజులుగా తిప్పుకుంటున్నారు తప్ప న్యాయం చేయడం లేదంటూ.. కేశవపట్నం బస్టాండ్ సమీపంలోని కిరాణం  షాపు లో గోద్రెజ్ హెయిర్ డ్రై త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.  ఆమెను హుజూరాబాద్  ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తున్నారు.  కోమల పై ఆత్మహత్య ప్రయత్నం కేసు నమోదు చేశారు.