Asianet News TeluguAsianet News Telugu

రైతాంగం గొంతుక వినిపించేందుకే రైతువేదికలు... నిరంజన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో జరిగిన రైతు వేదిక ఏర్పాటు కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి,  గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు భూమి పూజ చేసి, మొక్కలు నాటారు. 

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో జరిగిన రైతు వేదిక ఏర్పాటు కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి,  గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు భూమి పూజ చేసి, మొక్కలు నాటారు. తెలంగాణ మలి దశ 
ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగర్ జిల్లా అని, రైతు వేదికలు సమావేశాలకు పరిమితం కాకుండా రైతు పరిశోధన శాలగా ఉంటాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అరవై లక్షల పైబడి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని,  వ్యవసాయంపై 60 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ  అనీ అన్నారు. ప్రాజెక్ట్ లన్ని అమల్లోకి వస్తే తెలంగాణలో కోటి డెబ్బై లక్షల ఎకరాలు సాగుకు అందుతుందన్నారు.