సారీ అమ్మ.. అక్కను బాగా చూసుకో.. నేను చచ్చిపోతున్న..

బెహరాన్ లో కరీంనగర్ కు చెందిన వలస జీవి ఆత్మహత్య చేసుకున్నాడు. 

First Published Jul 14, 2020, 3:20 PM IST | Last Updated Jul 14, 2020, 3:20 PM IST

బెహరాన్ లో కరీంనగర్ కు చెందిన వలస జీవి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ బెహరాన్ లోని తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సాప్ మెసేజ్ లో తల్లిదండ్రులకు వాయిస్ రికార్డు పంపి చనిపోయాడు. ‘అమ్మా.. నీవు బాధపడకు, అక్కను బాగా చూసుకో.. నాకు మంచిగా అనిపించడం లేదు’ అంటూ వాయిస్ రికార్డు పంపించి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.