Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన

కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల నుండి పెంచుతున్న డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయకార్మికసంఘం, SFI,KVPS( కెవిపిఎస్) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద ఆటో కి తాళ్ళు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమంచేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల నుండి పెంచుతున్న డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయకార్మికసంఘం, SFI,KVPS( కెవిపిఎస్) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద ఆటో కి తాళ్ళు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమంచేపట్టారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్, బ్యారెల్ రేట్ తగ్గుతుంటే మోడీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు.పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు రవాణా రంగం, వ్యవసాయ రంగం పైన, నిత్యావసర సరుకుల పైన తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనివారపు రజనీకాంత్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.