Asianet News TeluguAsianet News Telugu

తాత అమ్మిన భూమికోసం.. ఎమ్మార్వో ఆఫీస్ ముందు విషం డబ్బాతో హల్ చల్..

Jul 29, 2020, 1:32 PM IST

తమ తాత పేరు మీద ఉన్న భూమిని తమకు చెందకుండా ఇతరుల కు అక్రమ పట్టా చేశారని కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన అనుపురం పరుశురాం, మహేష్ లు ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. తమ భూమిని రామడుగు తహసీల్దార్ కోమల్ రెడ్డి  అక్రమంగా వేరేవారి పేరుమీద చేశారంటూ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.