Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ కరెంట్ బిల్లులు... కేసీఆర్ వ్యూహం అదే.. పొన్నం ప్రభాకర్

తెలంగాణలో ప్రజల నుండి ఇష్టానుసారంగా కరెంట్ బిల్లులు వసూలు చేయడాన్నినిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఇ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా టెస్టులు పెంచండి.. 

తెలంగాణలో ప్రజల నుండి ఇష్టానుసారంగా కరెంట్ బిల్లులు వసూలు చేయడాన్నినిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఇ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా టెస్టులు పెంచండి.. కరెంటు బిల్లు తగ్గించండి.. అని కాంగ్రెస్ నాయకులు నినాదం చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేశారు. నాన్ టెలిస్కోపిక్ విధానాన్ని రద్దు చేస్తూ టెలిస్కోపిక్ విధానంతో కరెంటు బిల్లులను సరిచేస్తూ కరెంటు బిల్లు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఇ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు నల్ల మాస్కులు నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరోనా టైం లో అధిక బిల్లులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తక్షణమే మూడు నెలల కరెంట్ బిల్లు ను రద్దు చేయాలని లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.