కరోనా నుండి కోలుకున్న మేయర్ బొంతు రామ్మోహన్.. పనుల్లో బిజీ..
కరోనా బారిన పడి కోలుకున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తిరిగి పనుల్లో బిజీ అయ్యారు.
కరోనా బారిన పడి కోలుకున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తిరిగి పనుల్లో బిజీ అయ్యారు. శనివారం ఉదయం నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుని, కొన్ని మార్పులు చేసేందుకు ఇంజనీర్ కి ఆదేశాలు ఇచ్చారు. గత నెల చివర్లో మేయర్ కు లక్షణాలు లేకపోయినా టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మేయర్ కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది.