సచివాలయం కూల్చివేత... లక్డీ కపూల్ లో భారీగా ట్రాఫిక్ జాం...
సచివాలయం కూల్చివేత కారణంగా లక్డీకపూల్, ఖైరతాబాద్ లనుండి బషీర్ భాగ్ కు వెళ్లే రోడ్లన్నీ ట్రాఫిక్ జాంతో నిండిపోయాయి.
సచివాలయం కూల్చివేత కారణంగా లక్డీకపూల్, ఖైరతాబాద్ లనుండి బషీర్ భాగ్ కు వెళ్లే రోడ్లన్నీ ట్రాఫిక్ జాంతో నిండిపోయాయి. పాత సచివాలయం కూల్చివేత కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం గత అర్థరాత్రి నుండి కూల్చివేత ను ప్రారంభించింది. దీంతో సచివాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లున్నీ మూసివేయడంతో అన్నివాహనాలు ఒకే రూట్లో వెళ్లాల్సి రావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.