4లక్షల ఉద్యోగాలు కోసం 40లక్షలఉద్యోగులపై వేటు...: లోకేశ్

అధికారంలోకి వచ్చాక నాలుగు  లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏకంగా 40 లక్షల ఉద్యోగులను బలిచేయడానికి కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు.

First Published Oct 16, 2019, 2:38 PM IST | Last Updated Oct 16, 2019, 2:38 PM IST

అధికారంలోకి వచ్చాక నాలుగు  లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏకంగా 40 లక్షల ఉద్యోగులను బలిచేయడానికి కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ని  పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న పశు సఖి మహిళలు కలిశారు. నాలుగు నెలల నుండి తమకు జీతాలు రావడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. 
జీతాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మహిళా పశు సఖి వర్కర్స్ లో 
6400 మంది ఉద్యోగాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన 
తమ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అందరిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని  ఆరోపించారు.