దారుణం.. వృద్ధురాలిపై కుక్కలను వదిలిన రైల్వే ఉద్యోగి..
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం జరిగింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం జరిగింది. ఇచ్చిన అప్పు తీర్చమని వెళ్లిన వృద్దురాలి పైకి రంజిత్ నాయక్ అనే ఓ రైల్వే ఉద్యోగి కుక్కలను వదిలాడు. అంతేకాదు ఆ వృద్దురాలుపై భార్యాభర్తలు దాడికి దిగారు. రామావత్ చంపల్లి (70) అనే వృద్ధురాలుతాను దాచుకున్న డబ్బును తెలిసిన వాడని రంజిత్ నాయక్ అప్పు ఇచ్చింది. ఇప్పుడు అనారోగ్యం కారణంతో తన డబ్బులు కావాలని అడిగింది. డబ్బులు ఇవ్వకపోగా వృద్దురాలిపై కుక్కలను వదిలాడు. అంతేకాదు తాను ఆమెకు ఏమీ బాకీ లేనని, పత్రాలు చూపించాలని లేదంటే కోర్టులో కేసేసుకోమని దబాయిస్తున్నాడు. చంపల్లి పోలీసుల ఫిర్యాదు చేసింది.