Asianet News TeluguAsianet News Telugu

రాంగోపాల్ వర్మకు నచ్చిన సూసైడ్ క్లబ్

3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామచంద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం "సూసైడ్ క్లబ్". 

3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామచంద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం "సూసైడ్ క్లబ్". శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.