స్టార్ హీరోతో అనసూయ... బంపర్ ఛాన్స్ కొట్టినట్లే!
యాంకర్ అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది.
యాంకర్ అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. స్టార్ యాంకర్ గా అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తూనే, వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అధికారికంగా అందరికీ తెలిసి అనసూయ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. థాంక్ యూ బ్రదర్ అనే వెబ్ మూవీ చేస్తున్న అనసూయ, దర్శకుడు కృష్ణ వంశీతో రంగమార్తాండ మూవీ చేస్తున్నారు. అలాగే సిల్క్ స్మిత బయోపిక్ లో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.