కర్నూల్ లో వైసిపి వర్గాల వీరంగం... ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు (వీడియో)
కర్నూల్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో భయాందోళనలకు కారణమయ్యింది.
కర్నూల్: జిల్లాలో అధికార వైసిపి పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిన్న టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వైసిపికి చెందిన రెండు వర్గాలు చివరకు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇలా పట్టపగలే...నడిరోడ్డుపై..అదీ ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ దాడులు నగరంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమయ్యాయి. డీఈవో కార్యాలయంలో కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి...టెండర్ల హార్డ్ కాపీలను సమర్పిస్తున్న క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డోన్ వైసీపీ యూత్ లీడర్ తమ్ముడు రాఘవేంద్ర గౌడ్ మద్య వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్త చిలికిచిలికి గాలివానలా మారి పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది.