Asianet News TeluguAsianet News Telugu

న్యాయం కోసం రోడ్డెక్కిన టమోటా రైతు (వీడియో)

కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టమోటా మార్కెట్ లో దళారులు రైతులను మోసం చేస్తున్నారంటూ టమోటా రైతులు రోడ్డు ఎక్కారు. తమదగ్గరినుండి తక్కువ ధరకు కొని దళారులు ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇప్పుడు మార్కెట్లో కొనకుండా బయట కొనుగోలు చేస్తూ, ఎక్కువ కమీషన్లు తీసుకుంటూ మోసం చేస్తున్నారంటూ దళారుల మీద మండిపడ్డారు. మార్కెట్ లోనే టమోటాలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా కు దిగారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.