video:బడేటి బుజ్జి అంతిమయాత్రలో చంద్రబాబు, లోకేశ్ భావోద్వేగం..

టిడిపి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గురువారం మృతిచెందగా సాయంత్రం అంతిమసంస్కారాలు ముగిశాయి. ఆయన అంతిమయాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లు పాల్గొన్నారు.  

First Published Dec 26, 2019, 9:29 PM IST | Last Updated Dec 26, 2019, 9:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టిడిపి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (కోట రామారావు) అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంతిమయాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ తో పాటు తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారిద్దరు బుజ్జితో తమకున్న అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తమ అభిమాన నాయకున్ని చివరిచూపు చూసుకునేందుకు టీడిపి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.