Asianet News TeluguAsianet News Telugu

Video: ఠాగూర్ సినిమా స్టైల్లో... విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం

 

హెల్త్ చెకప్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లిన మృతదేహంగా తిరిగివచ్చిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 
 


 

విజయవాడ: హెల్త్ చెకప్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లిన మృతదేహంగా తిరిగివచ్చిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అయితే హాస్పిటల్ సిబ్బంది మానవత్వం లేకుండా వ్యవహరించారని సదరు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఐసియూలోకి తీసుకెళ్లి గంటలు గడిచినా ఏమీ చెప్పకుండా చివరకు గుండెపోటు వచ్చి చనిపోయినట్లు  చెప్పారని... దీనిపై తమకు అనుమానాలున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మృతుడి గ్రామస్తులు, స్నేహితులు హాస్పిటల్ ముందు  ధర్నాకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతపరిస్ధితి నెలకొనడంతో స్థానిక పోలీసులు ధర్నా చేస్తున్నవారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.