Video: మెట్రోలు కిటకిట.. మియాపూర్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు

Share this Video

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మియాపూర్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైలులో ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారన్నారు.

సాధారణ రోజుల్లో మూడు లక్షల మంది మెట్రోల్లో ప్రయాణిస్తుండగా ప్రస్తుతం మూడు లక్షల 50 వేల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగిందని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అదే విధంగా ప్రజలు సైతం మెట్రోను బాగా ఆదరిస్తున్నారని రెడ్డి వెల్లడించారు. 

Related Video