Asianet News TeluguAsianet News Telugu

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి: మంత్రి నిరంజన్ రెడ్డి (వీడియో)

తెలంగాణ ప్రజలు ఉన్నతంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అన్నారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

తెలంగాణ ప్రజలు ఉన్నతంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అన్నారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఆయన బుధవారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం కొండూరు, కోదండాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల స్వరూపం మారాలని ఆకాంక్షించారు. వందేళ్ల క్రితమే మహాత్మాగాంధీ గారు స్వాతంత్ర్యంతో పాటు దేశ ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో పాటు శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.

బహిరంగ మల విసర్జన ఉండొద్దని స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేశారని నిరంజన్ రెడ్డి తెలిపారు. మహాత్ముని 150 వ జయంతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయన కలగన్న కలలు సాకారం కాబోతున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా కలెక్టర్ శశాంక్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం , కలెక్టర్ శశాంక్ , మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.