Asianet News TeluguAsianet News Telugu

ఆదోని మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన (వీడియో)

గురువారం 3,720 రూపాయల పర్మిట్ తీసుకున్న రైతులు సైతం 3,100కే తమకు విత్తనాలు పంపిణీ చేయాలని లేదంటే ఎవ్వరికి ఇవ్వరాదంటూ ఆందోళన నిర్వహించారు. అధికారులు, ఇతర రైతులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో శనగరైతులు ఆందోళణకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఖరీఫ్‌లో వర్షాలు కురవకపోవడంతో శనగ రైతుల ఆశలు సన్నిగిల్లాయి.

అయితే రబీలో మంచి వర్షపాతం నమోదవ్వడంతో పాటు ప్రభుత్వం శనగ విత్తనాల పంపిణీ మొదలుపెట్టడంతో రైతులు మార్కెట్ యార్డులకు క్యూకట్టారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.6,200 కాగా.. రైతు రాయితీ కింద రూ.3,700లకు విత్తనాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రైతు రాయితీ 3,720 నుంచి 3,100కు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో గురువారం 3,720 రూపాయల పర్మిట్ తీసుకున్న రైతులు సైతం 3,100కే తమకు విత్తనాలు పంపిణీ చేయాలని లేదంటే ఎవ్వరికి ఇవ్వరాదంటూ ఆందోళన నిర్వహించారు. అధికారులు, ఇతర రైతులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.