video: సొంత పార్టీ నాయకులపైనే మాజీ మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు పట్టణం అనేక రకాల మాఫియాలకు అడ్డాగ మారిపోయిందని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రోజురోజుకు ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియాలతో పాటు కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మాఫియా గ్రూపులన్ని ఇక్కడ వున్నాయని అన్నారు. ఈ మాఫియాలపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు ఒక అడుగు ముందుకు వేయాలంటే వారి ఉద్యోగ భద్రత గుర్తొస్తోందని... అందువల్లే వెనక్కి తగ్గుతున్నారని  అన్నారు. ఈ మాఫియాల ఆగడాలతో నెల్లూరులో వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని ఆనం విమర్శించారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video