Asianet News TeluguAsianet News Telugu

Video:వైకుంఠ ఏకాదశి రద్దీ... మంత్రాలయ ఆలయంలో అపశృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ ఆవరణలో విషాద ఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబానికి చెందిన చిన్నారిపై  తులాభారం చేసే పెద్ద త్రాసు పడటంతో  తీవ్ర గాయానికి గురయ్యాడు.  ఇలా గాయానికి గురయిన బాలుడు హన్మంతు(10) ను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అతడి పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా వుందని డాక్టర్లు పేర్కొన్నారు. 
 
అయితే నిత్యం భక్తులతో  రద్దీగా వుండే ప్రాంతంలో తులాభారం కోసం త్రాసును ఏర్పాటుచేయడమే కాకుండా...అజాగ్రత్తగా వ్యవహరించిన ఆలయ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో ఆలయానికి వస్తే ఇలా ఆస్పత్రికి పోవాల్సి రావడంతో బాధాకరమని అంటున్నారు.