Asianet News TeluguAsianet News Telugu

video: దాయాదుల పోరులో దాచలేని నిజాలు

పాకిస్థాన్ ఇండియా క్రికెట్ అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ప్రపంచక్రికెట్ చరిత్రలోనే ఎంతో ఈ రెండు దేశాలమధ్య ఉన్న వైరం చాలా పాతది. 1947లో బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ఇస్తూ ఇస్తూ రెండు దేశాల మధ్య పెట్టిన విభజన చిచ్చుకు ప్రతిరూపం ఈ వైరం. ఇండో పాకిస్తాన్ యుద్ధాలు, కాశ్మీర్ గొడవలు ఇలా ఇరు దేశాల మధ్య జరిగే సంఘటనలు ఈ వైరంలో ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉంటాయి. దీంతో వీరిమధ్య ఉన్న వైరం తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఒకే రకమైన క్రికెట్ చరిత్ర ఉన్న రెండు దేశాలకూ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

1952లో సరిగ్గా ఇదేరోజు పాకిస్థాన్, ఇండియాల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా పాకిస్థాన్ ను ఓడించింది. పాకిస్థాన్-ఇండియాల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల కోసం 1952లో పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ టీం ఇండియా టూర్ చేసింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగింది. పాకిస్థాన్ ఢిల్లీలో ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే. 

పాకిస్థాన్ టీంలోని అబ్దుల్ కర్దార్, అమిర్ ఇలాహీలకు తప్ప మిగతా అందరికీ ఇదే మొట్టమొదటి మ్యాచ్. అబ్దుల్ హఫీజ్ కర్దార్ కు అంతకు ముందు మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. అమిర్ ఇలాహీ విభజనకు ముందు ఇండియా టీంలో ఒక మ్యాచ్ ఆడాడు. 

ఇండియా క్యాప్టెన్ లాలా అమర్ నాథ్ టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 139.4 ఓవర్లలో 372 రన్స్ చేసింది. 82 రన్లతో హేము అధికారి ఎక్కువ రన్స్ చేసిన రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో అమిర్ ఇలాహీ 4 వికెట్లు తీసుకున్నాడు.

బ్యాటింగ్ లో పాకిస్తాన్ వంతు వచ్చేసరికి వినో మాంకడ్ ట్రికీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ముందు నిలవలేకపోయారు. దీంతో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో అతి కష్టంగా 150 రన్స్ చేస్తింది. రెండో ఇన్నింగ్స్ లో 152 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో 13 వికెట్లు తీసి మాంకడ్ పాకిస్తాన్ జట్టును తుత్తునియలు చేశాడు. అలా ఇండియా 70 పరుగుల తేడాతో తన శత్రు దేశమైన పాక్ మీద మొట్టమొదటి అఖండవిజయం సాధించింది. 

లక్నోలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పాకిస్థాన్ గెలిచింది. అయితే ఆ తరువాత బాంబేలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.