Asianet News TeluguAsianet News Telugu

రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...

రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత జట్టు... 

రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత జట్టు... 70 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి చేధించింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 35 పరుగులు చేయగా, కెప్టెన్ అజింకా రహానే 27 పరుగులతో రాణించాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా.కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా, తొలి టెస్టులో చెత్త ప్రదర్శనను మరిపిస్తూ... రెండో టెస్టులో అద్భుతంగా రాణించింది టీమిండియా. ముఖ్యంగా కెప్టెన్‌గా అజింకా రహానే జట్టును నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ టెస్టుతో కలిపి మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే.. మూడు మ్యాచుల్లోనూ టీమిండియాకు విజయాలను అందించాడు.

Video Top Stories