గాయం కారణంగా షమీ దూరం, సిరాజ్, నటరాజన్ లలో ఒకరికి ఛాన్స్
ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు ఏదీ కలిసివచ్చినట్టుగా కనబడడంలేదు.
ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు ఏదీ కలిసివచ్చినట్టుగా కనబడడంలేదు. ఇప్పటికే డే నైట్ పింక్ బాల్ టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన భారత్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేసర్ షమీ గాయం కారణంగా ఈ మొత్తం సిరీస్ కె దూరమయ్యాడు. పాత బంతితో చెలరేగే మహ్మద్ షమి ముంజేయి ఫ్రాక్చర్‌తో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియా పర్యటన నుంచి నిష్క్రమించాడు. ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమి గాయపడ్డ విషయం తెలిసిందే..!