
భీకర బెంగళూరుపై యువ ఢిల్లీ బ్రహ్మాండమైన విజయం
IPL 2020 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చెత్త ఆటను ప్రదర్శించింది.
IPL 2020 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చెత్త ఆటను ప్రదర్శించింది. టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించి భారీ మూల్యం చెల్లించుకున్న ఆర్‌సీబీ, లక్ష్యచేధనలో కనీస పోరాటం కూడా చూపించకుండానే చేతులేత్తేసింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ దశలోనూ టార్గెట్‌వైపు సాగలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్‌సీబీ.
Add Asianetnews Telugu as a Preferred Source
