IPL 2023: రాజస్థాన్ రాయల్స్ టీమ్ బలాలు, బలహీనతలు ఇవే...
క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండగ మరికొన్ని రోజుల్లో మొదలవబోతుంది.
క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండగ మరికొన్ని రోజుల్లో మొదలవబోతుంది. పది టీమ్ లు పోరాడబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 31 న మొదలుకానుంది. మే 21న చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. 52 రోజుల వరకూ జరుగబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ మార్చి 31న గుజరాత్ టైటాన్స్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. ఈ లీగ్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉండనున్నాయి. ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. గతంలో కరోనాకు ముందు ఉన్న మాదిరిగానే ప్రతి జట్టు ఏడు మ్యాచ్ లు హోంగ్రౌండ్ లో ఏడు తమ ప్రత్యర్థుల గ్రౌండ్ లో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ప్రతి టీమ్ బలాబలాల విశ్లేషణలను క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఏషియానెట్ న్యూస్ వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా అందించారు. అందులో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ బలాబలాల విశ్లేషణ...