Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో చెన్నై కి కలిసొచ్చే అంశాలు అవే.. అందుకే మోస్ట్ ఫేవరేట్ టీం..

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. 

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. ఈ నేపథ్యంలో బయో- సెక్యూర్ బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే మ్యాచ్ ఆడనుండగా.. కరోనా వైరస్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారికి మాత్రమే ఆ బబుల్‌లోకి ఎంట్రీ ఉంటుంది. తాజాగా కరోనా పాజిటివ్ రావడంతో రుతురాజ్ గైక్వాడ్ క్వారంటైన్‌లోనే ఉండబోతున్నాడు. అయితే ఈసారి ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ టీం అంటూ... చెన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతల గురించి ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ గారు ఇలా విశ్లేషిస్తున్నారు.