ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: కంటితుడుపు విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా
INDvAUS 3rd ODI - మొదటి రెండు వన్డేల్లో ఓటమి తర్వాత జట్టులో మార్పులు చేసిన టీమిండియా...
INDvAUS 3rd ODI - మొదటి రెండు వన్డేల్లో ఓటమి తర్వాత జట్టులో మార్పులు చేసిన టీమిండియా... ఎట్టకేలకు ఆసీస్ టూర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్, ఓపెనింగ్ జోడిని విడదీయగా... గత రెండు మ్యాచుల్లో సెంచరీలతో చెలరేగిన స్టీవ్ స్మిత్‌ను తొందరగానే అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్ ఆసీస్ పతనాన్ని శాసించారు. డేంజరస్ మ్యాన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టు విజయాన్ని లాగేసుకున్నంత పని చేసినా కీలక సమయంలో కమ్ బ్యాక్ ఇచ్చిన బుమ్రా అతని అవుట్ చేశాడు. ఎట్టకేలకు బ్యాటింగ్‌లో టాపార్డర్ ఫెయిల్ అయినా హార్ధిక్, జడేజా, కోహ్లీ వల్ల మంచి స్కోరు చేయగలిగిన ఆస్ట్రేలియా, బౌలర్లు రాణించడంతో లక్ష్యాన్ని కాపాడుకుని క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. 303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్, 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 13 పరుగుల తేడాతో విజయం దక్కింది.