Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ అధ్యక్షుడి గంగూలీని చుట్టుముట్టిన వివాదాలు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వివాదాల్లో కూరుకుపోయాడు. 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వివాదాల్లో కూరుకుపోయాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం గంగూలీ వ్యాపార ప్రకటన ఒప్పందాలు కొత్త పుంతలు తొక్కుతుంది. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకుముందు, ఇప్పుడు బోర్డు బాస్‌గా గంగూలీ ప్రకటనల ఒప్పందాలకు గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతూ పలు విరుద్ధ ప్రయోజనాలతో పొందుతున్న అనుచిత లబ్ది పట్ల బోర్డు వర్గాలతో పాటు మార్కెట్‌ వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గంగూలీ కమర్షియల్‌ ఒప్పందాలు, పలు కంపెనీలకు ప్రచారకర్తగా కొనసాగుతుండటంపై ఇప్పటివరకు ఎవరూ బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ డిసెంబర్‌ 24న జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం)లో దాదాగిరి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సభ్యుల నుంచి ఎదురుకాబోయే అనూహ్య అస్త్రాలకు గంగూలీ వద్ద సమాధానం ఉందననుకోవటం భ్రమే కానుంది!.