Asianet News TeluguAsianet News Telugu

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసిపిదే... చంద్రశేఖర్ రెడ్డి విజయం

చిత్తూరు : ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి బలపర్చిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి విజయం సాధించారు. 

First Published Mar 17, 2023, 4:47 PM IST | Last Updated Mar 17, 2023, 4:47 PM IST

చిత్తూరు : ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి బలపర్చిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి విజయం సాధించారు. శుక్రవారం ఉదయం ఓట్ల   రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న చిత్తూరు కలెక్టర్ హరినారాయన్ ప్రకటించారు. సమీప ప్రత్యర్థి బాబురెడ్డి పొక్కిరెడ్డిపై 1,043 ఓట్ల ఆధిక్యంతో చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.