APకి అన్యాయం జరుగుతున్నా TDP ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించరా?: YSRCP MPs Comments | Asianet Telugu
కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. న్యూఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డితో పాటు ఎంపీలు పీవీ మిధున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్ అవినాశ్ రెడ్డి, ఎం.గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి చేద్దామని ఎన్నిసార్లు కోరినా తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో వ్యవహరించిందని ధ్వజమెత్తారు.