వివేకా హత్య కేసులో ఎవరున్నారు? ఆ రోజు అసలేం జరిగింది?: వైఎస్ అవినాష్ సంచలన వీడియో

హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఉన్నారో తెలుసుకోండి అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన  వీడియో బయటపెట్టారు. 

Share this Video

హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఉన్నారో తెలుసుకోండి అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వీడియో బయటపెట్టారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజుల ఏం జరిగిందో అవినాష్ వివరిస్తూ ఓ వీడియో బయటపెట్టారు. ఈ హత్య కేసులో తనను ఇరికించారని... తనకు దీంతో ఏ విధమైన సంబంధం లేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేకం సార్ హత్య గురించి తెలియగానే తాను ఆయన ఇంటికి వెళ్లానని.. అప్పటికే ఆయన రాసిన లెటర్, ఫోన్ ను అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెప్పడంతో పీఏ కృష్ణారెడ్డి దాచాడని అవినాష్ పేర్కొన్నారు. మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేసానని అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకం సార్ హత్యకేసులో ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వైపే ఏదో తప్పుందని అవినాష్ ఆరోపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video