ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు

గుంటూరు: ప్రమాదమని తెలిసినా ఓ యువకుడు సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. 

Share this Video

గుంటూరు: ప్రమాదమని తెలిసినా ఓ యువకుడు సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలు వద్ద ఫోటోలు దిగేందుకు కటికం వీరబ్రహ్మం అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే సాధారణంగా సెల్పీ దిగితే మజా ఏముంటుంది కాస్త రిస్క్ చేసి దిగుదామని అనుకున్నట్లున్నారు. గూడ్స్ రైలు పక్కన నిలబడి కాకుండా పెకెక్కి సెల్పీ పోజులు ఇవ్వసాగాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అతడి చేయి తగిలి కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో వీరబ్రహ్మం గిలగిలా కొట్టుకుంటూ అమాంతం ఎగిరి రైల్వే ట్రాక్ పై పడ్డాడు. అతడి శరీరం దాదాపు 70శాతం కాలిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు యువకుణ్ణి 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video