విశాఖలో దారుణం... మద్యం మత్తులో స్నేహితున్ని నరికిచంపిన యువకులు (సిసి ఫుటేజి)

విశాఖపట్నం: మద్యంమత్తులో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. 

First Published May 27, 2022, 1:47 PM IST | Last Updated May 27, 2022, 1:47 PM IST

విశాఖపట్నం: మద్యంమత్తులో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ లో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన రెబాక సాయితేజ (25) మద్యం మత్తులో మరో స్నేహితుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అందరూ కలిసి సాయితేజపై రాడ్లు, కత్తులతో దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. యువకుడి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.  మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసి కెమెరా ఫుటేజి ఆదారంగా నిందితులను గుర్తిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఈ హత్య దారితీసి వుంటుందని అనుమానిస్తున్నారు.