శ్రీకాకుళంలో ఉద్రిక్తత ... ఎస్సైపై కర్రలతో దాడికి దిగిన గ్రామస్తులు

శ్రీకాకుళం : ప్రతిసారీ తమను టార్గెట్ చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

Share this Video

శ్రీకాకుళం : ప్రతిసారీ తమను టార్గెట్ చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చాపురం మండలం లొద్ద కుంట గ్రామస్తులు ఓ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి ఇచ్చాపురం ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే గ్రామస్తులంతా ఒక్కటై ఎస్సైతో పాటు మిగతా సిబ్బందిపై దాడికి దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video