యూపీ గ్యాంగ్ ఆటకట్టించిన బెజవాడ పోలీసులు.. 273 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 14, 2025, 4:00 PM IST

విజయవాడలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గోడౌన్‌ నుంచి రెండున్నర కోట్ల విలువైన ఫోన్లు ఫిబ్రవరి 5న అపహరణకు గురయిన కేసును ఛేదించిన పోలీసులు... యూపీకి చెందిన ఆరుగురు దొంగలను అరెస్టు చేశారు. 273 ఖరీదైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబు తెలిపారు. దోపిడీ ముఠాకు చెందిన ఆరుగురు ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లావాసులుగా గుర్తించినట్లు తెలిపారు.

Read More...