Vallabhaneni Vamsi Arrest: డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చి అవమానిస్తారా?: అంబటి రాంబాబు | Asianet Telugu
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరగా, ఆయన మమ్మల్ని రమ్మని చెప్పి కలవకుండా అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదన్నారు. వంశీ టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారని... ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నించినా వంశీ కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నారని చెప్పారు.