కేంద్ర మంత్రి షెకావత్ కు సీఎం జగన్ ఇంట్లో ఆత్మీయ సత్కారం... ప్రత్యేక విందుభోజనం
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను ఇవాళ(శుక్రవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను ఇవాళ(శుక్రవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు.ఇందుకోసం ఇవాళ ఉదయమే ఏపీకి చేరుకున్న కేంద్ర మంత్రి విమానాశ్రయం నుండి నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఇంట్లోకి సాదర స్వాగతం పలికారు. షెకావత్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసారు సీఎం. అనంతరం సీఎం ఇంట్లోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విందులో కేంద్రమంత్రి షెకావత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.