విశాఖలో ఘోరం... బైక్ యాక్సిడెంట్ లో ముగ్గురు స్నేహితుల దుర్మరణం

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

Share this Video

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకోజి పాలెం జంక్షన్ సమీపంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ను వేగంగా దూసుకొచ్చిన డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో యువకులు సాయి, దుర్గ ప్రసాద్, గోపిలు రోడ్డుపై రక్తపుమడుగులో పడి మృతిచెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటన ఘటనాస్ధలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ కు తరలించారు. ఘటనాస్ధలంలో యువకుల తల్లిదండ్రుల రోదనలు చూసేవారితో కన్నీరు పెట్టిస్తున్నాయి. 

Related Video