Asianet News TeluguAsianet News Telugu

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిద్దమైన టిడిపి... పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్తత

అమరావతి : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Dec 28, 2022, 1:27 PM IST | Last Updated Dec 28, 2022, 1:27 PM IST

అమరావతి : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సబ్ ప్లాన్ నిధులను ఇతర పధకాలకి మళ్లించవడాన్ని నిరసిస్తూ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలపాలని టిడిపి ఎస్సీ సెల్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టిడిపి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై బైఠాయించి టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టిడిపి నాయకుల అరెస్ట్ కు సిద్దమవగా వారు ప్రతిఘటించడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు కొందరిని అదుపులోకి తీసుకుని, మరికొందరిని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు పోలీసులు. 
 

Video Top Stories